APPSC Geography TGPSC

World Geography Bits in Telugu – Universe And Solar System For All Competitive Exams

World Geography Universe And Solar System

World Geography Bits in Telugu – Universe And Solar System For All Competitive Exams

విశ్వం, సౌరవ్యవస్థ

1. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము ?
ఎ) విశ్వంలోని కొన్ని వేల మిలయన్ల నక్షత్రాల సముహాన్నే గెలాక్సీలు అని అంటారు.
బి) ఇప్పటి వరకు గుర్తించిన గెలాక్సీలలో అతి పెద్ద గెలాక్సీ ఆండ్రోమెడా.
సి) సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీని పాలపుంత లేదా ఆకాశగంగా అని పిలుస్తారు.
1)ఎ, బి,సి
2) ఎ, సి
3) బి,సి
4) ఎ, బి

2. క్రింది వాటిని జతపరుచుము.
జాబితా-1                                          జాబితా-2
ఎ) నిరంతర సృష్టి సిద్దాంతం    1) టాలమి & గ్లయోకో
బి) భూకేంద్రక సిద్దాంతం        2) అబ్బె జార్జ్ లెమైటర్
సి) డోలనా సిద్దాంతం              3) డా. అలెస్ శాండెజ్
డి) మహావిస్పోటన సిద్దాంతం    4) హెర్మన్ బోండీ, థామస్ గోల్డ్ & ఫ్రెడ్ హూయ్లే
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-3, బి-4, సి-1, డి-2

3. నక్షత్రాల గురించి క్రింది వానిలో సరికానిది ఏది ?
1) ఇది స్వయం ప్రకాశకాలు
2) స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉండటానికి కారణం -కేంద్రక సంలీన చర్య
3) అతి ప్రకాశవంతమైన నక్షత్రం – సీరియస్ ఎ
4) భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం బెటిల్ గ్రక్స్

4. క్రింది వాటిలో సరైనది ఏది ?
ఎ) నక్షత్రాలలోను మరియు విశ్వంలో అధిక శాతంలో ఉన్న వాయువు – హీలియం
బి) అతి వేగంగా ప్రయాణిస్తూ ఉన్న వేడి వాయువులతో కూడిన మేఘాలలాంటి వాయు మండలాన్ని నీహరిక లేదా నైబ్యులా అని పిలుస్తారు.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ,బి
4) పైవాటిలో ఏవి సరైనవి కావు



5. క్రింది వాటిలో సరైనవి ఏది ?
ఎ) నక్షత్రంలో కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత పదార్థం అంతా కేంద్రం దిశగా ఆకర్షించబడగా ఏర్పడిన ఖగోళ వస్తువులను “కృష్ణ బిలాలు” అంటారు.
బి) 1967లో అమెరికన్ ఆస్ట్రానమర్ జాన్వీలర్ బ్లాక్హోల్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించారు.
1) ఎ మాత్రమే
2) ఎ, బి
3) బి మాత్రమే
4) పెవాటిలో ఏవి సరెనవి కావు

6. కృష్ణ బిలాలపై పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఎవరు ? ఇతను ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతిని పొందాడు ?
1) 1916 – అల్బర్ట్ ఐన్ స్టీన్
2) 1967 – జాన్వీలర్
3) 1983 – సుబ్రహ్మాణ్య చంద్రశేఖర్
4) 1974 – స్టీఫెన్స్ హాకీన్స్

7. క్రింది వానిలో సరైనది కానిది ఏది ?
1) సూర్యుడిపై పరిశోధన నిమిత్తం ఇస్రో సంస్థ ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం – ఆదిత్య
2) సమాన సూర్యకాంతిని పొందే ప్రదేశాలను ‘ఐసోహెల్స్’ అంటారు
3) సౌర కుటుంబంలో అత్యంత వేడి గల గ్రహం బుధుడు –
4) సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం – బుధుడు

8. పరిమాణాన్ని బట్టి క్రింది గ్రహాలను అవరోహణ క్రమంలో అమర్చుము ?
ఎ) శని
బి) నెప్ట్యూన్
సి) శుక్రుడు
డి) బృహస్పతి
ఇ) భూమి

1)ఎ, సి,బి, డి, ఇ
2) డి, ఎ, సి, బి, ఇ
3) డి, ఎ, బి, సి, ఇ
4) డి, ఎ, బి, ఇ, సి

9. క్రింది వానిలో సరైనది ఏది ?
ఎ) పరిహేళి – ఇది సూర్యునికి, భూమికి మధ్యగల కనిష్ట దూరాన్ని తెలియజేస్తుంది.
బి) అపహేళి – ఇది సూర్యునికి, భూమికి మధ్యగల గరిష్ట దూరాన్ని తెలియజేస్తుంది.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) ఎ, బి సరైనవి కావు



10. క్రింది వానిలో సరికానిది ఏది ?
1) తరంగ పరికల్పనా సిద్దాంతం – జీన్స్ & జఫ్రీన్
2) ద్వినక్షత్ర సిద్ధాంతం – లిటిల్న్ & రస్సేల్
3) ఉల్కాపాత సిద్దాంతం – అట్టోమన్ & స్కిమిడ్
4) సూపర్ నోవా సిద్దాంతం- మౌల్టన్

 

Answers
1) 2     2) 3     3)4     4) 2     5)2
6)3     7) 3     8) 4     9)3     10)4

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025
APPSC Resource TGPSC

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025

  • December 17, 2025
Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025 గూగుల్ తన మొట్టమొదటి క్రెడిట్ కార్డును భారతదేశంలో ప్రారంభించింది. గూగుల్ పే ప్రముఖ
Indian History Practice Bits For APPSC TGPSC Exams
APPSC History TGPSC

Indian History Practice Bits For APPSC TGPSC Group 2 Exams

  • December 23, 2025
Indian History Practice Bits For APPSC TGPSC Exams – Alladi Publications సమాధానాలు: 1.32.2 3. 2 4. 1 5. 2 6.