AP Police Geography

AP Geography Bits: ఆంధ్రప్రదేశ్ ఉనికి – క్షేత్రియ అమరిక

AP Geography Bits ap geography

AP Geography Bits in Telugu For APPSC Group 2, SI & Constable Exams

  1. క్రింది వాటిలో సరైనవి ఏవి?
    a) తమిళుల ఆధిపత్యం నుంచి వేరుపడుతూ 1953 అక్టోబర్ 1న 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది.
    b) తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలను కలుపుతూ (హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలను) 1956 నవంబర్ 1న 23 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది.
    c) 2014 జూన్ 2న 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాగా, 13 జిల్లాలతో కూడిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
    1) a, b, c సరైనవి
    2) a, b సరైనవి
    3) b, c సరైనవి
    4) a, c సరైనవి

  2. క్రింది వాటిలో సరైనవి ఏవి?
    a) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ మండలాల సంఖ్య – 679
    b) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య- 76
    c) భారతదేశానికి నైరుతి దిశలో ఆంధ్రప్రదేశ్ తాళపుచెవి ఆకారంలో విస్తరించి వుంది.
    d) ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్-11 ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు.
    1) a, b, c
    2) b, c, d
    3) a, b, d
    4) a, b, c, d

  3. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
    a) దేశ భూభాగంలో అంధ్రప్రదేశ్ భూభాగ శాతం 4.87%
    b) దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం 4.09% –
    c) 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత – 382
    1) a, b సరైనవి
    2) b, c సరైనవి
    3) a, b, c సరైనవి
    4) a, b, c సరైనవి కావు

  4. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి 22?
    a) దేశ జనసాంద్రత, రాష్ట్ర జనసాంద్రతకు మధ్య గల అంతరం – 78
    b) దేశ స్త్రీ పురుష నిష్పత్తి, రాష్ట్ర స్త్రీ నిష్పత్తికి మధ్య గల అంతరం – 54
    1) a, b సరైనవి
    2) a మాత్రమే సరైనది
    3) b మాత్రమే సరైనది
    4) a, b రెండు సరికావు

  5. రాష్ట్ర అధికారిక చిహ్నాలకు సంబంధించి క్రింది వాటిని జతపర్చుము.
    జాబితా – 1 జాబితా -2
    a) రాష్ట్ర వృక్షం i) సిటాచుల క్రమేరి
    b) రాష్ట్ర పుష్పము ii) ఎంటిలోప్ సెర్వికాప్రా
    c) రాష్ట్ర పక్షి iii) అజాడిరక్టా ఇండికా
    d) రాష్ట్ర జంతువు iv) మాంజిఫెరా ఇండికా
    v) జాస్మినం అఫిసినేట్
    1) a-iv, b-v, c-i, d-ii
    2) a-iv, b-iii, c-i, d-ii
    3)a-iii, b-v, c-i, d-ii
    4)a-i, b-v, c-i, d-iv

  6. విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లాలు క్రింది వాటిలో ఏవి?
    1) పొట్టిశ్రీరాముల నెల్లూరు, ప్రకాశం, కర్నూల్, అనంతపురం.
    2) ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, YSR కడప పొట్టిశ్రీరాములు నెల్లూరు.
    3) ప్రకాశం, YSR కడప, అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు నెల్లూరు.
    4) ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, YSR కడప, అల్లూరి సీతారామరాజు.
  7. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి? (2011 జనాభా లెక్కల ప్రకారం)
    a) జాతీయ అక్షరాస్యత రేటుతో పోల్చినపుడు రాష్ట్ర అక్షరాస్యత రేటు తక్కువ.
    b) జాతీయ పురుష అక్షరాస్యతరేటుతో పోల్చినపుడు రాష్ట్ర పురుష అక్షరాస్యతరేటు తక్కువ.
    c) జాతీయ స్త్రీ అక్షరాస్యతరేటుతో పోల్చినపుడు రాష్ట్ర స్త్రీ అక్షరాస్యత రేటు ఎక్కువ.
    1) a, b సరైనవి
    2) b, c సరైనవి
    3) a, c సరైనవి
    4) a, b, c సరైనవి

8.క్రింది వాటిని జతపరుచుము (నూతన జిల్లాల సమాచారం ప్రకారం) అంశం
a) విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా i) నెల్లూరు
b) జనాభాపరంగా అతిపెద్ద జిల్లా ii) అల్లూరి సీతారామరాజు
c) అత్యల్ప మండలాలు iii) ప్రకాశం గల జిల్లా
d) అత్యల్ప జనసాంద్రత మన్యం iv) పార్వతీపుర
గల జిల్లా v) విశాఖపట్నం
1) a-iii, b-i, c-ii, d-v
2)a-iii, b-i, c-v, d-iv
3)a-iii, b-i, c-iii, d-ii
4)a-iii, b-i, c-v, d-ii

9. క్రింది వాటిలో సరైనది ఏది?
a) మన రాష్ట్రం 12º 41′ – 19 º 7′ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
b) అలాగే 76º 50′ – 84º40′ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
1) a మాత్రమే
2) b మాత్రమే
3) a, b రెండూ
4) పైవేవీ కావు

10. క్రింది వాటిలో సరైనవి ఏవి?
a) మన రాష్ట్రం నాలుగు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది.
b) తమిళనాడు రాష్ట్రంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి.
c) రాష్ట్రంలో భూపరివేష్టిత జిల్లాల సంఖ్య – 3
1) a, b సరైనవి
2) b, c సరైనవి
3) a, c సరైనవి
4) a, b, c సరైనవి

Answers
1.4 2.3 3.1 4.1 5.1
6.3 7.2 8.1 9.3 10.2

Also Read: Indian History Practice Bits For APPSC TGPSC Group 2 Exams

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams
Geography Resource

World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams

  • December 23, 2025
World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams 5 . క్రింది వానిలో సరైనది ఏది ?ఎ) డైక్: శిలాద్రవం భూ అంతర్భాగంలోని
Physics Important Bits in Telugu For APPSC TGPSC RRB Exams
AP Police Resource TG Police

Physics Important Bits in Telugu For APPSC TGPSC RRB Exams

  • December 26, 2025
Answers 1.4 2. 4 3.1 4.4 5 . 4 6.3 7.1 8. 1 9. 4 10. 2 Also Read: Indian