Indian History Practice Bits For APPSC TGPSC Group 2 Exams
Indian History Practice Bits For APPSC TGPSC Exams – Alladi Publications
- క్రింది వానిని జతపర్చండి.
ఎ. మొహంజదారో 1. జె.పి.జోషి
బి. లోథాల్ 2. ఎస్.ఆర్.రావు
సి. కాళీభంగన్ 3. దయారాంసాహ్ని
డి. ధోలవీర 4. ఆర్.డి. బెనర్జీ
ఇ. హరప్పా 5. బి.బి.లాల్
1) ఎ-1,బి-2,సి-3,డి-4,ఇ-5
2) ఎ-3,బి-2,సి-5,డి-1,ఇ-4
3)ఎ-4,బి-2,సి-5,డి-1,ఇ-3
4)ఎ-5,బి-4,సి-3,డి-2,ఇ-1
- సింధు ప్రజలకు తెలియనివాటిని గుర్తించండి.
ఎ. గుర్రము బి.ఖడ్గం
సి. పావురం డి. ఎద్దు
ఇ. ఇనుము ఎఫ్. ఏనుగు
జి. దున్నపోతు
1) ఎ,బి,సి,డి
2) ఎ,బి,ఇ
3) ఇ, ఎఫ్,జి
4) సి,డి,ఇ, ఎఫ్,జి - మౌర్యులు గురించి చెప్పిన మత గ్రంధాలు వివరణ ఇచ్చిన అంశాలలో సరికానిది గుర్తించండి.
1) దివ్య వదన – బౌద్ధమత వ్యాప్తికి అశోకుడు కృషి
2) పరిశిష్ట పర్విన్ – మార్య చంద్రగుప్తుడు జీవితవిశేషాలు
3) దీపవంశ – అశోకుడు బౌద్ధమత వ్యాప్తి
4) మహావంశ – అశోకుడు పరిపాలన విశేషాలు - కుషాణుల కాలంలో ప్రాంతీయ పరిపాలన విభాగాలుగా వరుస క్రమంలో పేర్కొండి.
1) రాష్ట్రం, ఆహారం, గ్రామం
2) రాష్ట్రం, విషయం, ఆహారం, గ్రామం
3) ఆహారం, విషయం, గ్రామం
4) రాష్ట్రం, విషయం, గ్రామం - ఈ క్రింది వానిని జతపర్చండి.
ఎ. ఇండియన్ ఐన్ స్టీన్ 1. ఆచార్యనాగార్జునుడు
బి. ఇండియన్ బిస్మార్క్ 2. సముద్రగుప్తుడు
సి. ఇండియన్ నెపోలియన్ 3. కౌటిల్యుడు
డి. ఇండియన్ అలెగ్జాండర్ 4. అల్లావుద్దీన్ ఖిల్జీ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-2, సి-1, డి-4 - ఈ క్రింది వానికి సరైన వివరణ ఇవ్వండి.
ఎ. శాసనాలు వేయించిన తొలివారు మౌర్యులు
బి. శాసనాలతో ప్రజలతో మాట్లాడిన రాజు అశోకుడు
1) ఎ మాత్రమే సరైనది
2) ఎ, బి మాత్రమే సరైనది
3) బి మాత్రమే సరైన వివరణ
4) ఎ, బి సరైన వివరణ కాదు - “మాళవికాగ్నిమిత్రం” గ్రంధం గురించి సరైన అంశాలు పేర్కోండి.
1) “మాళవికాగ్నిమిత్రం” గ్రంథాన్ని రాసినవాడు కాళిదాసు –
2) పుష్యమిత్రుడు కుమారుడు అగ్నిమిత్రుడు, మాళవికల ప్రేమ గ్రంధం
3) అగ్ని మిత్రుడు వివాహం ఆడిన విదర్బ రాకుమారి మాళవికను వివాహం ఆడినాడు.
4) పైవన్నీ - శుంగ వంశంలో రాజుల క్రమం సరైన క్రమంలో అమర్చండి.
ఎ. పుష్యమిత్రుడు
బి. అగ్ని మిత్రుడు
సి. భాగవతుడు
డి. దేవభూతి
1) ఎ, బి, సి,డి
2) ఎ, బి,డి,సి
3) ఎ, సి, బి,డి
4) ఎ,డి, సి, బి - చాళుక్యుల ముఖ్య విషయాలను గుర్తించండి.
ఎ. బాదామీ పట్టణమును కేంద్రముగా పాలన చేశారు.
బి. కర్ణాటక రాష్ట్రములో బీజాపూర్ జిల్లాలో ప్రస్తుతం బాదామీ కలదు.
సి. బాదామీ చాళుక్యుల వంశస్థాపకుడు – చల్కిరెమ్మణకుడు
డి. బాదామీ చాళుక్యుల రాజ్యస్థాపకుడు – జయసింహవల్లభ
1) ఎ, బి, సి,డి
2) బి, సి,డి
3) ఎ, సి,డి
4) ఎ,బి ,డి - ఈ క్రింద ఇవ్వబడిన అంశాలలో సరికాని జత గుర్తించండి.
1) చాళుక్యుల రాజధాని వాతాపి
2) రాజభాష – కన్నడం.
3) చిహ్నం – వృషభం
4) గొప్ప విగ్రహం – గోమంటేశ్వర
సమాధానాలు:
1.3
2.2
3. 2
4. 1
5. 2
6. 3
7. 4
8. 1
9. 1
10. 2
For More Practice Bits .. Download Our APP “Alladi Publications ” From Google Play Store
https://play.google.com/store/apps/details?id=co.lynde.nwrhh&hl=en





