Biology Important Questions For All Competitive Exams
Biology Important Questions For All Competitive Exams
- ఈ క్రింది వానిలో సరికానిది ఏది ?
1) జీవులలో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి దృఢమైన ఆకారం & రక్షణ నిచ్చే నిర్మాణం అస్థిపంజరం
2) శరీరం లోపల ఉండి శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని మరియు యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే నిర్మాణం- అంతర అస్థిపంజరం
3) మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ కొల్లాజన్
4) బాహ్య అస్థి పంజరం మృదులాస్థి, అస్థి అనే రెండు రకాల ఎముకలు కలవు
- ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి ?
జాబితా – 1 జాబితా – 2
ఎ) ఫీమర్ 1) పుర్రెలో అతి గట్టిది
బి) టిబియో 2) అతి చిన్న ఎముక
సి) క్రింది దవడ 3) అతిపెద్ద ఎముక
డి) కర్ణాంతరాస్థి 4) కప్పలో అతిపెద్దది
1) a-3, b-4, c-1, d-2
2) a-1, b-2, c-3, d-4
3) a-2, b-1, c-4, d-3
4) a-4, b-3, c-2, d-1
3.ఈ క్రింది వాటిని జతపరుచుము ?
భాగం ఎముకల సంఖ్య
ఎ) తల 1) 26
బి) చేతులు 2) 24
సి) వెన్నముక 3) 29
డి) ప్రక్కటెముకలు 4) 60
1) a – 1, b – 2 , c-3,d-4
2) a-2, b-1, c-4, d-3
3) a-4, b-3, c-2,d-1
4)a-3, b-4, c-1, d- 2
- ఈ క్రింది వాటిని జతపరుచుము ?
జాబితా – 1 జాబితా -2
ఎ) చెవి 1) కాలాలజి
బి) ముఖము 2) ఓటాలజి
సి) మృదులాస్థి ఎముకలు 3) క్రేనియాలజి
డి) కపాలం 4) కాండ్రాలజి
1) a-1, b-2, c-3, d-4
2) a-3, b-4, c-1, d-2
3) a-2, b-1, c-4, d-3
4) a-4, b-3, c-2, d-1
- అస్థిపంజరం యొక్క విధులలో సరికానిది ఏది ?
1) శరీరానికి ఆకారం నిర్మాణంను ఏర్పరుస్తుంది
2) సున్నిత అవయవాలకు రక్షణ
3) విటమిన్ల తయారీ
4) RBC, WBC ల ఉత్పత్తి
- విటమిన్లకు సంబంధించి క్రింది వానిలో సరైన అంశం ఏది ?
1) ఇవి సూక్ష్మ పోషకాలు, కర్బన సమ్మేలనాలు, ఆవశ్యక పదార్ధా
2) ఇవి ఎంజైమ్లతో కలిపి సహా ఎంజైమ్లుగా పని చేస్తాయి
3) వీటిని International Units లో కొలుస్తారు
4) పై అన్నీ సరైనవే
- ఈ క్రింది వానిలో సరైన ప్రతిపాదనను గుర్తించండి ? ప్రతిపాదన (A) : A, D, E, K లను కొవ్వులో కలిగే విటమిన్లు అంటారు. ఇవి శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉండును. కారణం (R) : నిమ్మజాతి ఫలాల వల్ల స్కర్వీ వ్యాధి నయమగును.
1) A మరియు R సరైనవి, Aకు R సరైన వివరణ
2) A మరియు A సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A నిజం మరియు R తప్పు
4) A తప్పు మరియు R నిజం
- ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి ?
-1) అధికంగా A- విటమిన్ కల్గిన పదార్థం క్యారెట్
-2) అధికంగా విటమిన్ A ఉండే ఆకుకూర బచ్చలి
3) పామాయిల్ పసుపు రంగులో ఉండటానికి కారణం విటమిన్ C –
4) విటమిన్ – A అధికంగా ఉండే ఫలం బొప్పాయి
- విటమిన్ – A కు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి?
1) దండ కాణాల నుండి రోడాప్సిన్, శంఖు కణాల నుండి అయోడాప్సిన్ అనే పదార్థాల ఉత్పత్తికి తోడ్పడును
2) చర్మం కాంతివంతంగా ఉండటానికి అవసరం
3) కంటి చూపుకు ఎముకల పెరుగుదలకు తోడ్పడును
4) పై అన్నీ సరైనవే
- ఈ క్రింది వాటిని జతపరుచుము ?
జాబితా – 1 జాబితా – 2
ఎ) అతిపెద్ద కండరం 1) సార్టోరియస్
బి) అతి చిన్న కండరం 2) మాసెటర్
సి) అతి పొడవైన కండరం 3) గ్లుటియస్ మాక్జిమస్
డి) అతి బలమైన కండరం 4) స్టెపీడియస్
1) a-1, b-2, c-3, d-4
2) a-2, b-1, c-4, d-3
3) a-3, b-4, c-1, d-2
4) a-4, b-3, c-2, d-1
Answers
1.1 2.1 3.4 4.2 5.3
6.4 7.2 8.3 9 4 10.4





