AP Police Resource TG Police

Physics Important Bits in Telugu For APPSC TGPSC RRB Exams

Physics Important Bits in Telugu For APPSC TGPSC RRB Exams
  1. ఈ క్రింది వానిలో సరైన వాక్యంను గుర్తించండి?
    1) సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే 8 గ్రహాలు, ఉపగ్రహాలు, శిలా శకలాలు అన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు.
    2) పరస్పర గురుత్వాకర్షణ శక్తితో బందించబడిన కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని నక్షత్ర మండలం అంటారు.
    3) గ్రీకు భాషలో గెలా అనగా పాలు అని అర్థం.
    4) పై అన్నీ సరైనవే
  2. ఈ క్రింది వానిలో సరికాని వాక్యంను గుర్తించండి?
    1) తమ చుట్టూ తాము తిరుగుతూ, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే ఖగోళ వస్తువులను గ్రహాలు అంటారు.
    2) ప్రస్తుతం సౌర కుటుంబంలోని గ్రహాల సంఖ్య = 8
    3) నక్షత్రాలు స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఖగోళ వస్తువులు.
    4) గ్రహాలు కూడా స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఖగోళ వస్తువులు.
  3. ఈ క్రింది వాటిని జతపరుచుము.
    జాబితా-1 జాబితా-2
    1)అత్యంత ప్రకాశవంత మైన గ్రహం a) భూమి
    2) నీలి గ్రహం b) నిహారిక
    3) భూమి తర్వాత జీవకోటికి అనువైన గ్రహం c) శుక్రుడు
    4) నక్షత్రాల జన్మస్థానం d) అంగారకుడు
    1) 1-c, 2-a, 3-d, 4-b
    2) 1-a, 2-d, 3-c, 4-b
    3) 1-d, 2-c, 3-b, 4-a
    4) 1-b, 2-a, 3-d, 4-c
  4. ఉపగ్రహాలకు సంబందించి క్రింది వాటిలో సరికాని వాక్యంను గుర్తించండి?
    1) విశ్వ ఆవిర్భావ క్రమంలో ఏర్పడి సహజంగా గ్రహాల చుట్టూ తిరిగేవి సహజ ఉపగ్రహాలు.
    2) భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు.
    3) మానవ అవసరాల కొరకు భూమి చుట్టూ తిరిగే విధంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడిన వస్తువులను కృతిమ ఉపగ్రహాలు అంటారు.
    4) స్పుత్నిక్-1 అనేది భారత్ తయారు చేసిన మొదటి. కృత్రిమ ఉపగ్రహం.
  5. ఈ క్రింది వాటిని జతపరుచుము.
    జాబితా-1 జాబితా-2
    1) ఆస్ట్రనామికల్ a) 149.5 23.2
    యూనిట్
    2) పార్సెక్ b) 3.26 కాంతి సంవత్సరాలు
    3) కాంతి సంవత్సరం c) 9.3 x 10 కి.మీ
    1) 1-a, 2-c, 3-b
    2) 1-c, 2-a, 3-b
    3) 1-b, 2-a, 3-с
    4) 1-a, 2-b, 3-c
  6. ఈ క్రింది వాటిని జతపరుచుము.
    జాబితా-1 జాబితా-2
    1) కోపర్నికస్ a) భూ కేంద్రక సిద్ధాంతం
    2) సుబ్రహ్మణ్య b) గ్రహ గమన నియమాలు చంద్ర శేఖర్
    3) కెప్లర్ c) సూర్య కేంద్రక సిద్ధాంతం
    4) టాలిమి d) కృష్ణబిలం
    1) 1-a, 2-d, 3-b, 4-c
    2) 1-a, 2-b, 3-c, 4-d
    3) 1-c, 2-d, 3-b, 4-a
    4) 1-c, 2-b, 3-a, 4-d

  7. ఈ క్రింది వానిలో సరికాని వాక్యంను గుర్తించండి?
    1) సూర్యునికి భూమికి మధ్య గల సగటు దూరాన్ని బ్లాక్హోల్స్ అంటారు.
    2) ఒక సంవత్సర కాలంలో కాంతి శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు..
    3) కృష్ణ బిలాల మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త -సుబ్రహ్మణ్య చంద్రశేఖర్.
    4) కాంతి ఒక సెకన్కి 3 లక్షల కి.మీ ల దూరం ప్రయాణిస్తుంది.
  8. ఈ క్రింది వాటిని జతపరుచుము.
    శాస్త్రవేత్త ప్రతిపాదించినది
    1) సుబ్రహ్మణ్య చంద్ర a) పార్సెక్
    2) హెర్బర్ట్ హాల్ టర్నర్ b) కాంతి సంవత్సరం
    3) హ్యుజెస్ c) బ్లాక్ హోల్స్
    4) క్రిస్టెన్సన్ రోమర్, హెర్బర్ట్ హాల్ టర్నర్ d) వాయువుల సమూహం
    1) 1-c, 2-a, 3-d, 4-b
    2) 1-c, 2-d, 3-a, 4-b
    3) 1-b, 2-а, 3-c, 4-d
    4) 1-b, 2-c, 3-d, 4-a
  9. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి?
    1) ఒక ఉపగ్రహంపై పనిచేసే అపకేంద్రబలం. భూమి ఆ ఉపగ్రహాన్ని ఆకర్షించే గురుత్వాకర్షణ బలంతో సమానంగా ఉన్నప్పుడే, ఆ ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతుంది.
    2) గురుత్వాకర్షణ బలం ఎక్కువైతే ఉపగ్రహం తిరిగి భూమిని చేరుకుంటుంది.
    3) గురుత్వాకర్షణ బలం తక్కువైతే ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది.
    4) పై అన్ని సరైనవి.
  10. ఈ క్రింది వానిలో పలాయన వేగం అనగా నేమి
    1) గ్రహాలు, ఉపగ్రహాలు పాటికక్ష్యలతో తిరిగుతున్నపుడు అవి కలిగి ఉండే వేగంను పలాయన వేగం అంటారు.
    2) భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రం నుండి తప్పించుకొని శాశ్వతంగా భూమి నుండి దూరంగా వెళ్ళడానికి వస్తువులకు ఉండవలసిన కనీస వేగంను పలాయన వేగం అంటారు.
    3) ఒక ఉపగ్రహం భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావటానికి పట్టే కాలాన్ని పలాయన వేగం అంటారు.
    4) ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార తిరిగే వేగాన్ని పలాయన వేగం అంటారు.

Answers

1.4 2. 4 3.1 4.4 5 . 4
6.3 7.1 8. 1 9. 4 10. 2

Also Read: Indian History Practice Bits For APPSC TGPSC Group 2 Exams

For More Practice Bits .. Download Our APP “Alladi Publications ” From Google Play Store

https://play.google.com/store/apps/details?id=co.lynde.nwrhh&hl=en

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025
APPSC Resource TGPSC

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025

  • December 17, 2025
Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025 గూగుల్ తన మొట్టమొదటి క్రెడిట్ కార్డును భారతదేశంలో ప్రారంభించింది. గూగుల్ పే ప్రముఖ
World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams
Geography Resource

World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams

  • December 23, 2025
World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams 5 . క్రింది వానిలో సరైనది ఏది ?ఎ) డైక్: శిలాద్రవం భూ అంతర్భాగంలోని