Geography Resource

World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams

World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams

World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams

  1. క్రింది వాటిని జతపరుచుము.
    గ్రహం కనుగొన్న శాస్త్రవేత్త
    ఎ) వరుణుడు 1) క్రయిడ్ టామ్ బాగ్, పెర్సివాల్ లోవెల్
    బి) ఇంద్రుడు 2) విలియం హెర్షల్
    సి) ప్లూటో 3) గెలిలియో
    డి) శని 4) బోహాన్ గాల్, ఆడమ్స్, లీ-వెర్రియర్
    1) ఎ-1, బి-2, సి-3, డి-4
    2) ఎ-2, బి-4, సి-1, డి-3
    3) ఎ-4, బి-1, సి-2,డి -3
    4) ఎ-3, బి-4, సి-1, డి-2
  2. క్రింది వాటిలో సరైనది ఏది ?
    ఎ) రేఖాంశాల ఆధారంగా భూగోళంపై గల వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలను, ప్రజల జీవన విధానాలను మరియు భూమధ్యరేఖ నుండి ఒక ప్రదేశం ఎంత దూరంలో ఉన్నదో తెలుసుకొనవచ్చును.
    బి) అక్షాంశాల ఆధారంగా భూమిపై గల వివిధ ప్రదేశాలు లేదా వివిధ దేశాలలోని కాలసమయాలను తెలుసు కోవచ్చును.
    1) ఎ, బి
    2) బి మాత్రమే
    3) ఎ మాత్రమే
    4) ఎ, బి రెండూ సరైనవి కావు
  3. క్రింది వానిలో సరికానిది ఏది ?
    1) మొట్టమొదటిసారిగా భూమి గుండ్రంగా ఉంటుందని శాస్త్రీయంగా తెలిపినది – అరిస్టాటిల్
    2) ప్రపంచ పటాన్ని తొలిసారిగా రూపొందించిన వ్యక్తి -అనాక్సీ మాండర్
    3) భోగోళ శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్
    4) భూ పరిమాణ శాస్త్ర పితామహుడు అనాక్సీ మాండర్
  4. భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు భౌతిక, రసాయనిక లక్షణాల పరంగా వివరించిన వాటిలో సరైనవి ఏవి ?
    ఎ) సుయాస్ అనే శాస్త్రవేత్త భూ అంతర్ నిర్మాణాన్ని 4 పొరలుగా విభజించారు.
    బి) వాండర్ గ్రాచ్ మరియు గూటెన్బర్గ్ అనే శాస్త్రవేత్తలు భూ అంతర్మిర్మాణాన్ని 3 పొరలుగా విభజించారు.
    1) ఎ. బి
    2) ఎ మాత్రమే
    3) బి మాత్రమే
    4) ఎ, బి సరైనవి కావు

5 . క్రింది వానిలో సరైనది ఏది ?
ఎ) డైక్: శిలాద్రవం భూ అంతర్భాగంలోని రెండు పొరల మధ్యన ప్రవహించి క్షితిజ సమాతరంగా ఘనీభవించి ఒక పొరవలె ఏర్పడుతుంది. దీనినే డైక్ అంటారు.
బి) సిల్: శిలాద్రవం ఉపరితలానికి ప్రవహించే మార్గం మధ్యలో సమతల రాతి పొరల మధ్య చేరి 90° కోణంలో అనగా నిట్టనిలువుగా ఘనీభవించడం వలన గోడవలె నిటారుగా ఉండే శిలాస్వరూపం ఏర్పడుతుంది. దీనినే సిల్ అంటారు.
1) ఎ , బి
2) ఎ మాత్రమే
3) బి మాత్రమే
4) ఎ, బి రెండూ సరైనవి కావు

6 . క్రింది వాటిని జతపరుచుము.
జాబితా-1 జాబితా-2
ఎ) షాకోలిత్ 1) డోమ్ లేదా కలశ ఆకారం
బి) బాతోలిత్ 2) సాసర్ ఆకారం
సి) లాకోలిత్ 3) అర్ధ చంద్రాకృతి
డి) లావోలిత్ 4) అధిక ఉష్ణం
1) ఎ-4, బి-1, సి-2,డి -3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3,సి-4, డి-1

  1. కెనడా దేశంలోని ‘ఫండే అఖాతం’ వద్ద ప్రపంచంలోనే ఎతైన పోటులు ఏర్పడటానికి కారణం ?
    1) భూభాగంచే పరివేష్టితమై తక్కువ లోతును కలిగి ఉండటం
    2) భూభాగంచే పరివేష్టితమై ఎక్కువ లోతును కలిగి ఉండటం
    3) బలమైన సముద్ర మరియు భూపవనాల ప్రభావం వలన
    4) తూర్పు పవనాల ప్రభావం వలన
  2. క్రింది వాటిలో సరైనది ఏది ?
    ఎ) అతి సూక్ష్మమైన కణాలతో నిర్మించబడి పొరలు పొరలుగా ఏర్పడి శిలా జాలాను కలిగి ఉండే శిలలు – అవక్షేపశిలలు.
    బి) ఆమ్ల శిలలకు ఉదాహరణ- బసాల్ట్, గాబ్రో, డోలరైట్
    1) ఎ మాత్రమే
    2) బి మాత్రమే
    3) ఎ, బి
    4) పై రెండూ సరైనవి కావు
  3. క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించుము ?
    1) నీస్, పలకరాయి, గ్రాఫైట్
    2) పాలరాయి, నీస్, సోడియం క్లోరెడ్
    3) సున్నపురాయి, సోడియం క్లోరైడ్, జింక్ సల్ఫేట్
    4) గ్రానైట్, బసాల్ట్, గాబ్రో
  4. భూకంప ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి సరికాని జత ఏది?
    1) జోన్-5 : రిక్టర్ స్కేలు పై తీవ్రత 1-5 వరకు ఉంటుంది
    2) జోన్-4 : రిక్టర్ స్కేలుపై తీవ్రత 6-7 వరకు ఉంటుంది
    3) జోన్-3 : రిక్టర్ స్కేలుపై తీవ్రత 4-6 వరకు ఉంటుంది
    4) జోన్-2 : ద్వీపకల్ప పీఠభూములలోని మిగిలిన ప్రాంతం
  5. క్రింది వాటిలో సరైనది ఏది ?
    ఎ) సునామీ అనే పదం ‘సు’ మరియు ‘నామీ’ అనే రెండు జపనీస్ పదాల కలయికచే ఏర్పడింది.
    బి) ఇందులో ‘సు’ అనగా ఓదువు, ‘నామీ’ అనగా తరంగాలు అని అర్థం.
    1) ఎ మాత్రమే
    2) బి మాత్రమే
    3) ఎ, బి
    4) పై రెండూ సరైనవి కావు
  6. క్రింది వాటిని జతపరుచుము?
    జాబితా-1 జాబితా-2
    ఎ) హిందూకుష్ 1) టిబెట్
    బి) హిమాలయ పర్వతాలు 2) చైనా
    సి) కున్లున్ 3) అఫ్ఘనిస్తాన్
    డి) టియానాషాన్ 4) భారత్
    1) ఎ-1, బి-2, సి-3, డి-4
    2) ఎ-3, బి-4, సి-1, డి-2
    3) ఎ-2, బి-1, సి-4, డి-3
    4) ఎ-4, బి-3, సి-2, డి-1

సమాధానాలు

  1. 2
  2. 4
  3. 3
  4. 4
  5. 4
  6. 2
  7. 2
  8. 1
  9. 2
  10. 1
  11. 3
  12. 2

Also Read: Indian History Practice Bits For APPSC TGPSC Group 2 Exams

For More Practice Bits .. Download Our APP “Alladi Publications ” From Google Play Store

https://play.google.com/store/apps/details?id=co.lynde.nwrhh&hl=en

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025
APPSC Resource TGPSC

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025

  • December 17, 2025
Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025 గూగుల్ తన మొట్టమొదటి క్రెడిట్ కార్డును భారతదేశంలో ప్రారంభించింది. గూగుల్ పే ప్రముఖ
Physics Important Bits in Telugu For APPSC TGPSC RRB Exams
AP Police Resource TG Police

Physics Important Bits in Telugu For APPSC TGPSC RRB Exams

  • December 26, 2025
Answers 1.4 2. 4 3.1 4.4 5 . 4 6.3 7.1 8. 1 9. 4 10. 2 Also Read: Indian