Resource

Science And Technology Bits in Telugu For All Competitive Exams

Science And Technology Bits in Telugu

Science And Technology Bits in Telugu For All Competitive Exams

  1. క్రింది వాటిలో సరైనవి ఏవి ?

ఎ) దేశంలో అధునాతన యుద్ధ నౌకలు INS సూరత్, INS నీలగిరి, జలాంతర్గామి INS వాగ్దార్లను ప్రధాని మోడీ 2025, జనవరి 15న ముంబాయిలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు.

బి) ఇలా ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

1) ఎ సరైనది

2) బి సరైనది

3) ఎ, బి సరైనవి

4) ఎ, బి సరైనవి కావు

 

  1. INS సూరత్ కి సంబంధించి క్రింది వానిలో సరికానిది ?

1) ప్రాజెక్టు 17ఏ లో భాగంగా అభివృద్ధి చేస్తున్న నాలుగవ యుద్ద నౌక ఇది

2) దీనిని ముంబైలోని మజ్గావ్  డాక్ యార్డ్  కంపెనీ నిర్మించినది

3) ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ద నౌకల్లో INS సూరత్ ఒకటి

4) అత్యాధునిక సర్వేలియన్స్ రాడార్స్, సెన్సార్లు కలిగిన ఈ నౌక పొడవు 163 మీటర్లు

 

  1. క్రింది వాటిలో సరైనది ఏది ?

ఎ) INS నీలగిరిని ప్రాజెక్టు 17ఏ లో భాగంగా నిర్మితమైన స్టెల్త్ ఫ్రిగేట్.

బి) దీనిని ఇండియన్ నేవి వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది.

సి) ఫ్రిగేట్లు సముద్రంలో వాణిజ్యానికి సంబంధించిన ఓడలకు ఇవి రక్షణను కల్పిస్తాయి.

1) ఎ, బి సరైనవి

2) బి, సి సరైనవి

3) ఎ, సి సరైనవి

4) ఎ, బి, సి సరైనవి

 

  1. INS నీలగిరికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏవి?

ఎ) INS నీలగిరి యుద్ద నౌకపై ఎల్లవేళలా 8 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ కలిగి ఉండి, శత్రువుల మిస్సైల్స్ను నింగిలోనే ఛేదించి సముద్రంలోనే కూల్చివేసే శక్తిని కలిగి ఉంటాయి.

బి) అత్యవసరంలో ఫైటర్స్ నింగిలోకి ఎగిరేందుకు హెలిక్యాప్టర్ను కూడా మోసుకెళ్తుంది.

1) ఎ, బి సరైనవి కావు

2) ఎ, బి సరైనవి

3) ఎ సరైనది

4) బి సరైనది

 

  1. INS వాగ్షీరకు సంబంధించి సరైనది ఏది ?

ఎ) స్కార్పియన్ క్లాస్ ప్రాజెక్టు -75లో భాగంగా నిర్మించిన ఆఖరి ఆరో జలాంతర్గామి.

బి) జపాన్కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీనిని నిర్మించారు.

సి) యాంటి సర్ఫేస్, యాంటీ సబ్మెరైన్ పోరాటాలు రెండింటిల్లోనూ ఉపయుక్తంగా ఉండేలా దీనిని రూపొందించారు.

1) ఎ, సి సరైనవి

2) బి, సి సరైనవి

3) ఎ, బి సరైనవి

4) ఎ, బి, సి సరైనవి

 

  1. క్రింది వాటిని జతపరుచుము.

జాబితా-1                  జాబితా-2

ఎ) INS నీలగిరి       1) ప్రాజెక్టు 15 బి

బి) INS వాగే షీర్    2) ప్రాజెక్టు 17 ఏ

సి) INS సూరత్     3) ప్రాజెక్టు 75 

1) ఎ-1, బి-2, సి-3

2) ఎ-2, బి-3, సి-1

3) ఎ-3, బి-1, సి-2

4) ఎ-1, బి-3, సి-2

 

  1. ‘INS నిర్దేశక్’ నౌకకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది ?

1) INS నిర్దేశక్ నౌకను 2024, డిసెంబర్ 18న విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు

2) దీనిని ప్రధానంగా హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, నావిగేషన్, సముద్ర కార్యకలాపాలలో సహాయం చేయడానికి రూపొందించారు.

3) ఈ నౌక పొడవు 110 మీటర్లు కాగా బరువు 3800 టన్నులు

4) దీనిని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించింది

 

  1. INS నిర్దేశకు సంబంధించి సరైనది ఏది ?

ఎ) ఈ నౌక సముద్రంలో 25 రోజులకు పైగా నౌక పనిచేయగలడు. 18 నాటికల్ మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడం, విస్తృతమైన సర్వేలు, నిరంతర కార్యకలాపాలు నిర్వహించగలిగే సామర్థ్యంను కలిగి ఉంది.

బి) స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌకలో అడ్వాన్స్డ్ హైడ్రోగ్రఫి చెందిన మల్టీభీమ్ ఎకో సౌండర్లు, సైడ్ స్కాన్ సోనార్లు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ వంటివి ఉన్నాయి.

1) ఎ సరైనది

2) బి సరైనది

3) ఎ, బి సరైనవి

4) ఎ, బి సరైనవి కావు

 

  1. క్రింది వాటిలో సరైనది ఏది ?

ఎ) అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక 2024, డిసెంబర్ 24న సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్ళి, అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది.

బి) దీనితో ఈ ఘన సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది.

1) ఎ, బి సరైనవి కావు

2) ఎ సరైనది

3) బి సరైనది

4) ఎ, బి సరైనవి

 

  1. పార్కర్ సోలార్ ప్రోణ్కు సంబందించి క్రింది వానిలో సరికానిది ఏది ?

1) అమెరికాకు చెందిన నాసాతో పాటు పలు ఇతర పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పార్కర్ ప్రోబ్ను సంయుక్తంగా రూపొందించారు.

2) పార్కర్ సోలార్ ప్రోబ్ 1800 డిగ్రీల ఫారెన్హీట్ వంటి అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా పటిష్ట కవచంతో ఏర్పాటై ఉంటుంది.

3) పార్కర్ సోలార్ ప్రోబ్ వేగం గంటకు 6000 కిలో మీటర్లు

4) సూర్యుడి నుంచి అత్యధిక ఉష్ణోగ్రత జనించడానికి కారణం ఏమిటన్నది మరింత బాగా అర్ధం చేసుకోవడానికి ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించారు

 

Answers

1) 3    2) 1   3) 4    4)2   5) 1

6) 2   7)1     8) 3     9) 4   10) 3

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025
APPSC Resource TGPSC

Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025

  • December 17, 2025
Daily Telugu Current Affairs For APPSC TSPSC Exams : 17-12-2025 గూగుల్ తన మొట్టమొదటి క్రెడిట్ కార్డును భారతదేశంలో ప్రారంభించింది. గూగుల్ పే ప్రముఖ
World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams
Geography Resource

World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams

  • December 23, 2025
World Geography MCQ in Telugu For APPSC TGPSC Exams 5 . క్రింది వానిలో సరైనది ఏది ?ఎ) డైక్: శిలాద్రవం భూ అంతర్భాగంలోని